గోల్కోండ కోట బోనమెత్తింది. అషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు అంగరంగవైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్ హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.